Thursday, April 23, 2026
E-PAPER
Homeబీజినెస్స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్: రికార్డ్ స్థాయిలో 1.3 కోట్లకు పైగా ఓట్లతో వెల్లడైన  హైదరాబాద్ లోని అత్యంత...

స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్: రికార్డ్ స్థాయిలో 1.3 కోట్లకు పైగా ఓట్లతో వెల్లడైన  హైదరాబాద్ లోని అత్యంత ఇష్టమైన రెస్టారెంట్లు

- Advertisement -

  • 1.3 కోట్లకు పైగా వోట్లు – ఇది గత ఏడాదితో పోలిస్తే 2.2 రెట్ల పెరుగుదల
  •  దేశవ్యాప్తంగా  110 శ్రేణుల్లో   గెలుపొందిన  15 వేలకు పైగా బ్రాండ్స్

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో తొలి ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ (NSE: SWIGGY/BSE: 544285), తమ అతి పెద్ద దేశవ్యాప్త ఎడిషన్ లో భాగంగా  స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026 యొక్క హైదరాబాద్ విజేతలను ప్రకటించింది. ఈ అవార్డ్స్ కు 6.43 లక్షల విలక్షమమైన యూజర్లు నుండి అద్భుతమైన 1.3 కోట్లకు పైగా వోట్లు వచ్చాయి, ఇది గత ఏడాది కంటే 2.2 రెట్లు పెరుగుదలను సూచించింది, ఇప్పటి వరకు అతి పెద్ద ఎడిషన్ గా చేసింది.

160కి పైగా నగరాలు, 110 శ్రేణులు, మరియు 15,000 విజేత బ్రాండ్స్ లతో, ఈ ఏడాది అవార్డ్స్ ఫుడ్ డెలివరీ, డైన్ అవుట్ అనుభవాలలో ఉత్తమమైన వాటిని ఘనంగా గౌరవించాయి. 43.8 లక్షల మంది వినియోగదారులు ఓటింగ్ లింక్ లను భాగస్వామం చేయడం ద్వారా ఈ భాగస్వామ్య స్థాయి భారీగా పెరిగింది. ఇందులో ప్లాట్ ఫాంకు కొత్తగా వచ్చిన 25 వేల మంది వినియోగదారులు కూడా పాల్గొన్నారు.  2026 ఎడిషన్ కూడా ఢిల్లీ వంటి ఎక్కువ భాగస్వామ్యం ఉన్న మార్కెట్స్ పై దృష్టి సారించి నగరాల ఎంపికను ఉత్తమంగా చేయడంతో పాటు ప్రాంతీయ శ్రేణులు, నగరం నేతృత్వంలోని అంశాలు ద్వారా మరింత  సన్నిహితమైన సంబంధాన్ని చూసింది.

హైదరాబాద్ లో, ఆహారం డెలివరీ మరియు డైన్ అవుట్ శ్రేణుల్లో స్థానిక దిగ్గజాలు నగరంలోని సుసంపన్నమైన వంటకాల వారసత్వం మరియు పరిణామం చెందుతున్న ఆహార ప్రాధాన్యతలను సూచించాయి. ఆహార డెలివరీలో పిస్తా హౌస్, మెహ్ ఫిల్, షా ఘౌస్ హోటల్ &రెస్టారెంట్, బవర్చి, మరియు కృతుంగ వంటి అగ్ర విజేతలు దిగ్గజపు వారసత్వపు బ్రాండ్స్ ను మరియు నగర ఆహార సంస్కృతితో పోలిక కలిగిన స్థానికంగా అభిమానించే ఆహారాల మిశ్రమాన్ని చూపించాయి.  డైనింగ్ అవుట్ శ్రేణిలో  అంతెర కిచెన్ మరియు బార్, కృష్ణపట్నం,హెబిటేట్ కేఫ్, హార్ట్ కప్ కాఫీ, మరియు హార్లీస్ ఫైన్ బేకింగ్  వంటి ప్రసిద్ధి చెందిన గమ్యస్థానాలు నగర ఛాంపియన్స్ గా తలెత్తాయి.    

అవార్డ్స్ గురించి వ్యాఖ్యానిస్తూ, సిద్ధార్థ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్, ఇలా అన్నారు “హైదరాబాద్ భారతదేశపు అత్యంత దిగ్గజపు ఆహార మార్కెట్లలో ఒకటిగా కొనసాగుతోంది, ఇక్కడ వినియోగదారులు తమ ఎంపికలతో చురుకైన ట్రెండ్స్ ను సృష్టిస్తున్నారు. ఈ ఏడాది స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ లో హైదరాబాద్ నుండి అనూహ్యంగా పాల్గొనడం,  ప్రముఖ వారసత్వపు బ్రాండ్స్ నుండి అభివృద్ధి చెందుతున్న అభిమాన  బ్రాండ్స్ వరకు ఆహారం పట్ల   ఈ నగరానికి ఉన్న  గాఢమైన  ప్రేమను సూచిస్తోంది. ”

జాతీయంగా, బిర్యానీ అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రేణిగా 7.02 లక్షల వోట్లతో వచ్చింది, తదుపరి పిజ్జా, నార్త్ ఇండియన్, బర్గర్, మరియు చైనీస్ లు వచ్చాయి. 2026 ఎడిషన్ కూడా  ఈట్ రైట్, కార్పొరేట్/డెస్క్ ఈట్స్, మరియు  పాస్తా, అరబిక్ క్యూజిన్, చీజ్ కేక్, మండీ, మరియు గ్రిల్స్ & షావాయ వంటి  ట్రెండింగ్ డిష్ ఫ్యామిలీస్  కొత్త మరియు ట్రెండ్-నేతృత్వంలోని శ్రేణులుగా విస్తరించాయి. నాటి స్టైల్ బిర్యానీ, రాయలసీమ్ క్యూజిన్, సౌత్ ఇండియన్ టిఫిన్స్, మరియు మరాఠీ ఫుడ్ వంటి శ్రేణులతో ప్రాంతీయ అభిమాన ఆహారం కూడా మరింత శక్తివంతమైంది మరియు అవార్డ్స్ మరింత స్థానికంగా సంబంధాన్ని కలిగి ఉండేలా చేసాయి.

స్థానిక ఆహార సంస్కృతిని  తీర్చిదిద్దడంలో  వినియోగదారుల ఎంపికకు పెరుగుతున్న ప్రభావాన్ని స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026 తెలియచేసాయి. ఇందులో హైదరాబాద్ ఒక కీలకమైన మార్కెట్ గా నిలిచింది మరియు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక అభిమాన ఆహారాల ఆదరణ పొందిన రెస్టారెంట్లు మరియు కొత్త ధోరణులను సృష్టించే బ్రాండ్స్ లను సత్కరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -