టి-శాక్స్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి..

– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతి పత్రం అందజేత..
– తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ రంజిత్ కుమార్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో టి శాక్స్ ఉద్యోగులను విలీనం చేసుకోవాలని టి శాక్స్ ఉద్యోగులు ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ రంజిత్ కుమార్ మాట్లాడుతూ..టి శాక్స్ ఉద్యోగులు గత 20 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్ యందు   హెచ్ఐవి పేషంట్లకి , హెచ్ఐవి పరీక్షలు ఐసిటిసి ,ఏఆర్టి , డిఎస్ఆర్ సి, పి పి టి సి  మొదలగు విభాగాలు ప్రభుత్వ హాస్పిటల్ లో పేషంట్లకి సర్వీస్ అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తుందని, టి శాక్స్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతి పత్రము అందించినట్లు తెలిపారు. టి శాక్స్ ఉద్యోగుల సమస్యల పైన ఐటి మంత్రి కేటీఆర్ దృష్టికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి టి శాక్స్ ఉద్యోగులందరినీ రాష్ట్ర ప్రభుత్వములో విలీనం చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ అందిస్తున్న టీ శాక్స్ ఉద్యోగులను  ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో  రాష్ట్ర ఉద్యోగులుగా విలీనం చేసుకున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఎలాంటి భారం పడదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014లో ఒక నివేదికను ఆయా రాష్ట్రా ల హెల్త్ సెక్రటరీకి ,ప్రాజెక్ట్ డైరెక్టర్లకి పంపించడం జరిగింది అన్నారు. ఈ ఉద్యోగులను రాష్ట్ర ఉద్యోగులుగా కలుపుకుంటే మేము ఇప్పుడు ఏ విధంగా అయితే  ప్రతి సంవత్సరం డబ్బులు  అదేవిధంగా డబ్బులను కేటాయించడం జరుగుతుందని సూచించడం జరిగిందన్నారు.కేంద్రకేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రిన్సిపాల్ హెల్త్ సెక్రటరీలకు ప్రాజెక్ట్ డైరెక్టర్లకు అధికారులకు నివేదికలు పంపించడం జరిగింది అన్నారు.ఈ నివేదికను ఆధారం చేసుకుని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు శాక్స్ ఉద్యోగులను ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలు విలీనం చేసుకున్నాయని తెలిపారు.టి శాక్స్ ఉద్యోగులను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా  ఫ్యామిలీ వెల్ఫే డిపార్ట్మెంట్ లో విలీనం చేసుకొని మాకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ వేత రెంటల కేశవరెడ్డి, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర  అధ్యక్షులు ఎ. రంజిత్ కుమార్, వరంగల్ జిల్లా డిపిఎం స్వప్న మాధురి, వరంగల్ జిల్లా డిఎస్ రామకృష్ణ, ఎల్ టీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు
Spread the love