నవతెలంగాణ -సుల్తాన్ బజార్
నకిలి కేబుల్ వైరు లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాచిగూడకు చెందిన ముకుల్ దుగ్గార్ (24) ఇతను సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ మార్కెట్లో శ్రీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ పేరిట వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఫినోలెక్స్ నకిలి కేబుళ్లను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, సుల్తాన్ బజార్ పోలీసులు అతని షాపుపై దాడిచేసి నకిలీ ఫినోలెక్స్ నకిలి కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈ నకిలి కేబుళ్లను ఇతనికి అందజేస్తుండడంతో అక్రమంగా ఈ కేబుళ్లను ముకుల్ అనే వ్యక్తి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద 305 మీటర్ల 16 బ్యాగుల నకిలి కేబుల్తో పాటు రూ.1.50 లక్షల విలువైన 100 మీటర్ల కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కాపీరైట్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.