తాడి బిలోలి రామాలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం..

 

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం తాడి బిలోలి రామాలయ కమిటీ చైర్మన్ గా పెద్దోళ్ల సుధాకర్ రావు శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల చైర్మన్ తో పాటు, సభ్యులకు ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులుగా పురం రాజు, డి .సాయిలు, ధర్మన్న, అనుమవ్వ లను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో గతంలో చైర్మన్ కార్యదర్శులుగా పనిచేసిన లింగాల అబ్బన్న, మల్లా సాయిలు, గ్రామ పెద్దలు ఎండి మౌలానా, హనుమంతరావు, లింగారెడ్డి, అర్కెల శ్రీనివాస్, మధు, పార్వతి రాజేశ్వర్, అన్వర్, ఉమార్, ప్రతాప్ రెడ్డి, బాబా, అవధూత్ రావు, అనంత రావు, చరణ్, ఉమేష్, హరి గౌడ్, నవీన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love