తైబజార్ వేలం ఇద్దరి మధ్య పోటా పోటీగా సాగింది..

– రూ.13 లక్షల 11 వేలకు అవార్వార్ హనుమాన్లు దక్కించుకున్నారు
– గత ఏడాది తైబజార్ వేలం రూ.10 లక్షల ఇరవై రెండు వేలు పలికింది
– ఈ ఏడాది రెండు లక్షల రూ.90 వేల రూపాయలు అధికంగా వేలం పాట
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ తైబజార్ వేలం పాట గురువారం నాడు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ బండి వార్ విజయ్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో చాలామంది పాటలు పాల్గొనేందుకు రూ.50 వేల రూపాయల చొప్పున డిపాజిట్లు పెట్టినప్పటికీ, ఇద్దరి మధ్యనే వేలంపాట పోటాపోటీగా సాగింది. నేనంటే నేనే సాధించుకునే విధంగా వేలం పాట సాగింది. పాకల్ వార్ శివ లింగు మరొకరు అవర్ వార్ హనుమాన్లు మధ్య సాగిన వేలంపాట చివరిగా, రూ.13 లక్షల పదకొండు వేల రూపాయలకు అవార్వార్ హనుమాన్లు దక్కించుకున్నారు. గురువారం కొనసాగిన తైబజార్ వేలంలో గత ఏడాది కంటే ఈ ఏడాది రెండు లక్షల 89 వేల రూపాయలు అధికంగా పలికింది. గ్రామపంచాయతీకి అత్యధికంగా ఆదాయం రావడానికి ఆ ఇద్దరి మధ్య పోటీపడ్డ వారికి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ విజయ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. గత ఏడాది తైబజార్ వేలం రూ.10 లక్షల ఇరవై రెండు వేలు పలుకగా ఈ ఏడాది తైబజార్ వేలంలో పోటీ పెరిగింది. దీనితో గ్రామపంచాయతీకి దాదాపు రెండు లక్షల 90 వేల రూపాయలు ఆదాయం అధికంగా సమకూరింది. ఈ వేలం పాట చూడడానికి చాలామంది గ్రామస్తులు హాజరయ్యారు.

Spread the love