నూలి పురుగుల దినోత్సవము సందర్బంగా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా భువనగిరి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్ ఆధ్వర్యంలో మండల టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  బోల్లపెల్లి పిహెచ్.సి పరిధి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో అంగన్వాడి లో 11800 మంది పిల్లలందరి లక్ష్యంగా ఈ కార్యక్రమం ఈనెల 20వ తేదీన నిర్వహించబడునని ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు టీచర్లు, యాజమాన్యం అందరూ సహకరించాలని ఆమె కోరారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారి డాక్టర్ యామిని, శృతి ,ఎమ్ఈఓ నాగవర్ధన్ రెడ్డి ఐసిడిఎస్ సూపర్ వైజర్ వైదేహి,ఆరోగ్య పర్యవేక్షక సిబ్బంది శోభారాణి ,రేణుక ,విజయ, అరుణ ప్రఫుల్ల ,సురేష్ కుమార్ పాల్గొన్నారు.

Spread the love