
నవతెలంగాణ – బెజ్జంకి
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు అక్రమ ఇసుక నిల్వల స్థావరాలపై శుక్రవారం దాడి చేశారు. మండల పరిధిలోని గాగీల్లపూర్,బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను గుర్తించారు. ఇసుక నిల్వలపై చట్టపరమైన చర్యలకు స్థానిక పోలీసులకు అదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక, రేషన్ బియ్యం తరలింపు,మత్తు పదార్థాలను కలిగియున్న, విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 8712667446, 8712667447 నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.