రవాణా భవిష్యత్తు కోసం గ్రీన్ కోర్సును రూపొందించిన టాటా మోటార్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశ పట్టణీకరణ, సుస్థిర చలనశీలతపై దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో,  పరిశుభ్రమైన రవాణా ఎంపి కల వైపు మళ్లడం చాలా కీలకంగా మారింది. దేశం ఎలక్ట్రిక్, హైడ్రోజన్ సెల్-ఆధారిత వాహనాల వైపు కదులుతున్నందున, ఉద్గా రాలను తగ్గించడానికి మధ్యంతర పరిష్కారం అవసరం. ‘పరివర్తన ఇంధనం’గా సహజ వాయువు గుర్తించబడింది. ఇది ఆదర్శ వంతమైన వంతెనగా పనిచేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ సహజ వాయువుతో నడిచే వాహనాల అభివృద్ధికి చురుకుగా సహకరిస్తోంది. దాని నైపుణ్యం, వినూత్నతలకు నిబద్ధతతో, టాటా మోటార్స్ భారతదేశం లో సుస్థిరమైన రవాణాకు పరివర్తనను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

నీతి ఆయోగ్ నివేదిక అంచనా ప్రకారం, 2050 నాటికి భారతీయ రోడ్లపై ట్రక్కులు నాలుగు రెట్లు పెరుగనున్నాయి. సహజ వాయు వు ఆధారిత ఇంధనాలకు మారాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. వాణిజ్య వాహన పరిశ్రమలో పర్యావరణం, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి ఈ మార్పు కీలకం. ఉద్గార తగ్గింపు, శక్తి భద్రతకు అంకితమైన భారతదేశం, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)ను చురుకుగా ప్రోత్సహిస్తోంది. CNG ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశ ముడి చమురు దిగుమతి బిల్లును సమర్థవంతం గా తగ్గిస్తుంది. వినూత్నత, సుస్థిరమైన రవాణా పరిష్కారాలకు అంకితం చేయబడిన టాటా మోటార్స్ మరింత పర్యావరణ అను కూలమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కోసం భారతదేశ ఆకాంక్షలకు అనుగుణంగా వాణిజ్య వాహన రంగంలో సీఎన్జీ  స్వీకరణను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 150కిపైగా సీఎన్జీ స్టేషన్లను కలిగిఉండి, పరిశుభ్ర ఇంధన ఎంపికల విస్తృత లభ్యతకు తోడ్పడుతోంది.

2030 నాటికి 17,000 కార్యాచరణ సీఎన్జీ  స్టేషన్‌ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో భారతదేశం తన సహజ వాయువు మౌలిక సదుపాయాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టింది. గ్యాస్ గ్రిడ్, అదనపు LNG టెర్మినల్స్, బయో- సీఎన్జీ  కోసం SATAT పథకం వంటి జాతీయ కార్యక్రమాలు సహజ వాయువు ప్రాప్యతను విస్తృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. టాక్స్ క్రెడిట్‌లు, సబ్సిడీలు వంటి ప్రోత్సాహకాలు గ్యాస్ ఆధారిత వాహనాలను స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తాయి. కొత్త సహజ వాయువు ధరల యంత్రాంగానికి ప్రభుత్వ ఆమోదం పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్జీ అందుబాటును మరింత పెంచుతుంది, ఇది భారతదేశ సుస్థిరమైన రవాణా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.

శ్రీ రాజేష్ కౌల్, వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ – ట్రక్స్, టాటా మోటార్స్ ఇలా అన్నారు ‘‘టాటా మోటార్స్ లో మేం స్థిరమైన ఇంధనాల వైపు పరివర్తనలో ముందంజలో ఉన్నాం. మా విస్తృత శ్రేణి సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాలు, 2045 నాటికి నికర జీ రో ఉద్గారాలను సాధించడంలో మా నిబద్ధతతో, సుస్థిరమైన లాజిస్టిక్స్‌ లో మేం అగ్రగామిగా ఉన్నాం. ఆటో ఎక్స్‌ పో 2023లో మా సహజ వాయువు, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఎంపికల ప్రదర్శన రవాణా భవిష్యత్తును రూపొందించడంలో మా అంకితభావాన్ని ప్రదర్శి స్తుంది. అనుకూలమైన నిర్వహణ ఆదాలతో నడిచే సీఎన్జీ ఆధారిత వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగుతున్న లభ్యత, పరిశ్రమ యొక్క జీరో-ఎమిషన్ వాహనాల వైపు ప్రయాణంలో సహజ వాయువు కీలక పాత్ర పోషిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. వీటన్నింటితో మేం గ్రీన్, మరింత సమర్థవంతమైన భవిష్యత్తు వైపు వాహన పరిశ్రమను నడిపిస్తున్నాం’’ అని అన్నారు.

Spread the love