నవతెలంగాణ-మణుగూరు
నవంబర్ 2న టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నామని ఏరియా ఉపాధ్యక్షులు ఊకంటి ప్రభాకర్ రావు తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయం మేరకు మణుగూరు ఏరియాలోని పీవీ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు నవంబర్ 2న సాయంత్రం 05 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా విజయకేతనం ఎగురవేసిందేకు కార్మిక వర్గాన్ని చైతన్య పరచి సమన్వయ దిశగా అడుగులు వేసేందుకు దిశ నిర్దేశం చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య హాజరు కానున్నారని, విశిష్ట అతిథులుగా స్థానిక శాసన సభ్యులు రేగా కాంతారావు, మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత హాజరు కానున్నారని వారితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా హాజరు అవుతారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా లోని అన్ని గనుల, డిపార్ట్ మెంట్‌ల ఫిట్ సెక్రటరిలు ఫిట్ కమిటీ సభ్యులు, టీబీజీకేఎస్ నాయకులు, శ్రేణులు కార్యకర్తలు, ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ రవుఫ్, బ్రాంచి నాయకులు వీర భద్రయ్య, కాపా శివాజి, యస్‌వియస్ యన్ వర్మ, సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి, బానోత్ కృష్ణ, అశోక్, అన్ని గనుల డిపార్ట్ మెంట్‌ల ఫిట్ సెక్రటరీలు ఫిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.