ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలి : టీడీపీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
దివంగత ముఖ్యమంత్రి ఎన్‌ టి రామారావు కు ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించాలని రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు జంపాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ నిలువెత్తు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. అనంతరం అనంతరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీ యాల్లో దేశ రాజకీయాల్లో చైతన్యవంతమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, గహ నిర్మాణం, వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను సంక్షేమ పథకాలను నిర్వ హించిన ఘనత ఎన్టీ రామారావుదే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సూరవరం వెంకటరామయ్య, ఎస్‌ రవీంద్ర చారి, జిల్లా నాయకులు దేవానాయక్‌, కష్ణ ప్రసాద్‌, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

Spread the love