టీమిండియా ఘన విజయం.. ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చిన ఆశ్విన్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్‌ 4-1తో సిరీస్‌ సొంతం చేసుకుంది. మూడో రోజు ఆట మొదలు పెట్టిన కాసేపటికే భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ లో 477 పరుగులకు ఆలౌట్‌ అయ్యి.. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ను బుమ్రా వేయగా… రెండో ఓవర్‌ ను అశ్విన్‌ వేశాడు. 1.5 ఓవర్‌ వద్ద ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ను అశ్విన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత 5.3 ఓవర్లో మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలేను పెవిలియన్‌ చేర్చాడు. అశ్విన్‌ వేసిన బంతికి స్లిప్‌లో ఉన్న సర్ఫరాజ్‌ కు క్యాచ్‌ ఇచ్చి క్రాలే ఔటయ్యాడు. 10.3 ఓవర్లో ఒలీ పోప్‌ను కూడా అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌కు కుల్దీప్‌ యాదవ్‌ 39 పరుగులతో ఆడుతున్న బెయిర్‌ స్టోను ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్‌ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఆశ్విన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. లంచ్‌ బ్రేక్‌ తరువాత భారత్‌ మరింత జోరు కనబరిచింది. అశ్విన్‌ బౌలింగ్‌లో బెన్‌ ఫోక్స్‌(8) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ఆశ్విన్‌కు ఐదో వికెట్‌ దక్కింది. అనంతరం బూమ్రా 34 ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. తొలుత 28 పరుగులు చేసిన టామ్‌ హార్ల్టే ఎల్‌బీగా వెనుదిరిగాడు. మార్క్‌ వుడ్‌ క్రీజులోకి వచ్చిన వేంటనే పరుగులేమీ చేయ్యకుండా ఎల్‌బీగా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో జోరూట్‌ తన కేరిర్‌లో 61 టెస్టు అర్ధశతకం నమోదు చేశాడు. రూట్‌ 128 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జో రూట్‌, బెయిర్‌స్టో (39), టామ్‌హార్టే (28) పర్వలేదనిపించగా.. బెన్‌ డకెట్‌ (2), క్రాలే (1), ఒలీ పోప్‌ (19), బెన్‌ స్టోక్స్‌ (2), బెన్‌ పోక్స్‌ (8), మార్క్‌ ఉడ్‌ (0), బషీర్‌ 11 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో ఆశ్విన్‌కు 5, కుల్‌దీప్‌ 2, బూమ్రా 2, జడేజా వికెట్లు తీశారు.

Spread the love