Friday, May 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో కన్నీటి వ్యధ

గాజాలో కన్నీటి వ్యధ

- Advertisement -


రఫా : గాజాలో ఎటు చూసినా కన్నీటి వ్యధలే కనిపిస్తున్నాయి. యుద్ధం ముగిసినా ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 75 వేల మందికి పైగా చనిపోయారు. నెతన్యాహు యుద్ధోన్మాదానికి అంతంలేకుండా పోయింది. పాలస్తీనాలోని భూ భాగాన్ని దురాక్రమిస్తున్నది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ దుశ్చర్యలో అమాయకులెందరో బలిపోతున్నారు. ఎడతెరిపిలేకుండా ఇజ్రాయిల్ తెగబడుతుంటే..క్షతగాత్రులై ఆస్పత్రుల్లో నానా అవస్థలు పడుతున్నారు. ఒక ఆశ్రయ కేంద్రంలో 13 ఏండ్ల అక్రమ్ అల్-ఫయూమి తన కృత్రిమ కాలు స రోలర్‌బ్లేడ్స్‌తో ఒక మంచంపై బతుకీడుస్తున్నాడు.. ఆగస్టు 2024లో, తుఫ్ఫా ప్రాంతంలోని అబ్దేల్ ఫత్తా హమ్మౌద్ పాఠశాలపై ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడిలో ఈ పాలస్తీనా యువకుడు తన కుడి కాలును , ఎడమ చేతిని కోల్పోయాడు. ఈజిప్టులో చికిత్స పొందిన అనంతరం, అక్రమ్ గత నెలలో గాజాకు తిరిగి వచ్చాడు. ఇలా మరెందరో వైద్య సేవలు అందక బతుకుజీవుడా అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -