హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు కలిగిన టెక్నో సంస్థ కొత్తగా ల్యాప్‌టాప్‌ల విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. మెగా బుక్ ల్యాప్‌టాప్ టి1ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇది అసమానమైన పనితీరు, నిరంతరాయ వినియోగం, సున్నితమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షించనుందని తెలిపింది. 17.5 గంటల ఇంటెల్ 11 జనరేషన్ ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చినట్టు పేర్కొంది. దీని ప్రారంభ ధరను రూ.37,999గా నిర్ణయించింది. సెప్టెంబర్ 13 నుంచి అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.