వరి ధాన్యం కొనుగొల్లలో నిర్లక్ష్యం చేయొద్దు: తహసీల్దార్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
వరి ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దని హుస్నాబాద్ తహసిల్దార్ రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని  పోతారం ఎస్ ,బంజరుపల్లి, మార్కెట్ యార్డ్, నాగారం, మహమ్మదాపూర్, పందిళ్ళ, పొట్లపల్లి, మడద,రాములపల్లి లో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కేంద్రాలను హుస్నాబాద్ తాహసిల్దార్ రవీందర్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మార్కెటింగ్ కేంద్రాలలో నీడ, మంచినీళ్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ కంపల్సరిగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు . ఏ ఈ ఓ  ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని ధాన్యం ఆరబెట్టి సెంటర్ కు తీసుకురావాలని నాణ్యత ప్రామాణాలు  పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై తోట మహేష్, ఐకెపి ఎపిఎం జి శ్రీనివాస్, సి సి అశోక్, సీఈవో తిరుమల, వి ఓ ఏ లు మమత,  రైతులు పాల్గొన్నారు.
Spread the love