
బీజేపీ మండల అధ్యక్ష పదవికి మద్దినేని తేజ రాజు శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తేజ రాజు మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల అధ్యక్ష పదవిలో కొనసాగ లేక పోతున్నానని, సామాన్య కార్యకర్తగా పార్టీకి తన సేవలు అందిస్తానని తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాంకు అందజేయడం జరిగిందని అన్నారు. ఇంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగిన తనకు సహకరించిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కేవలం వ్యక్తిగత కారణాలవల్లే పార్టీకి న్యాయం చేయలేకపోతున్నాన అన్న బాధతో అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నా నని మరి ఇతర కారణాలు కాదని దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని జిల్లా అధ్యక్షుడిని కోరడం జరిగిందన్నారు. ఇకపై సామాన్య కార్యకర్తగా పార్టీకి తన సేవలు అందిస్తానని పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.