తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సమాప్తమైంది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందో ప్రముఖ ప్రైవేట్ టీవీ ఛానెల్ టీవీ-9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేయగా.. బీజేపీ 7 చోట్ల విజయం సాధిస్తుందని పేర్కొంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అవుతోందని వెల్లడించింది. ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే ఆరా సంస్థ సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. బీజేపీ 8-9 సీట్లు, కాంగ్రెస్‌ 7-8, ఎంఐఎం 1, బీఆర్ఎస్‌‌కు ఒక్క ఎంపీ సీటు కూడా అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు ఎంపీ సీటు కూడా దక్కదని చెప్పడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Spread the love