పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

– పదో తరగతి పరీక్ష కేంద్రాల తనిఖీ
నవతెలంగాణ – కరీంనగర్ 
పదో తరగతి పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ లో ఉన్న సెయింట్ ఆల్పోన్స్ పాఠశాల,  మంకమ్మతోటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ధన్గర్ వాడి) లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో  మొత్తం ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.. మొదటి రోజు ఎంత మంది హాజరయ్యారు.. కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై చీఫ్ సూపరిండెంట్లను జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఎలాంటి తప్పుదాలకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెయింట్ ఆల్ఫ్ న్స్ పాఠశాలలో దివ్యాంగులు పరీక్ష రాస్తున్న గదిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వారు పరీక్ష రాసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది రాస్తున్నారని తెలుసుకున్నారు.  ఆయా చోట్ల ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు వేణు కుమార్, బీ రమేశ్ బాబు, చీఫ్ సూపరిండెంట్లు మోహన్ రెడ్డి, ప్రమోద, డివో లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love