ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ఆప్ నేతలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు ఆప్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్ కార్యాలయం వద్దనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఆప్ శ్రేణుల కవాతు నేపథ్యంలో, ఢిల్లీ డీడీయూ మార్గ్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు. అటు, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్ధన్ మండవ స్పందించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆప్ కార్యకర్తల కవాతును అడ్డుకున్నామని, వెళ్లిపోవాలని సూచించామని స్పష్టం చేశారు. అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

Spread the love