వయోజన బీసీసీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

– వయోజన బీసీజీ టీకా పర్యవేక్షణ అధికారి డాక్టర్ సంతోష్ కుమార్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం లో  పెద్దవారికి బీసీజీ టీకా కార్యక్రమం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎం ఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వయోజన బీసీజీ టీకా పర్యవేక్షణ అధికారి డాక్టర్ సంతోష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. 60 ఏళ్ల పైబడిన వారందరికీ బీసీసీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, 18 ఏళ్ళ పైబడి పొగ త్రాగుడు అలవాటు ఉన్నవారు లేదా గతంలో టీవీ వ్యాధిగ్రస్తులు ఐదు ఏళ్ళ క్రితం టీవీ మందులు వాడిన వారు, టీవీ వ్యాధిగ్రస్తులతో సన్నిహిత సంబంధం గలవారు ఉన్నట్లయితే, వారందరి పేర్లు నమోదు చేసుకోవాలని సర్వే నిర్వహించాలని ఆశా కార్యకర్తలకు ఆదేశించారు. అనంతరం ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యకర్తలు అందరూ ఈ సర్వేను క్రోడీకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు నివేదిక పంపాలని బీసీసీ వ్యాక్సినేషన్ కొరకు ఎన్ని సెషన్స్ కావాలో తెలపాలని కోరారు. సరియైన ప్రణాళిక తయారుచేసి దశలవారీగా 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ తప్పకుండా వయోజన బీసీసీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ కో-ఆర్డినేటర్ రవికుమార్ ,టీబీ పర్యవేక్ష కురాలు స్రవంతి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షణ అధికారి అక్బర్ అలీ, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love