నవతెలంగాణ-సిద్దిపేట
గ్రామ గ్రామాన తిరిగి మున్నూరు కాపులందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా మున్నూరు కాపు సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, నాయకులు పాల సాయిరాం అన్నారు. ప్రెస్ క్లబ్‌లో ఆదివారం మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్, డైరీనీ సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఫిబ్రవరి 4న వేముల వాడలో నిర్వహించ తలపెట్టిన మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం 11వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను జిల్లా నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాల సాయిరాం, జిల్లా అధ్యక్షుడు నాయకం మల్లయ్య, గౌరవ అధ్యక్షులు సొప్ప పూర్ణ చంద్ర శేఖర్, అద్యక్ష, ప్రధాన కార్యదర్శి మరిపల్లి నారాయణ, సందుల సతీష్ కుమార్, మ్యాడ శ్రీధర్, అల్లం ఎల్లం, వెంకట రాజం, హరికిషన్, కృష్ణమూర్తి, ఆకుల బాలయ్య, వేణు, బాను తదితరులు పాల్గొన్నారు.