రైతన్నల కళ్ళలో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం 

The aim of the government is happiness in the eyes of the farmers– మాట ఇస్తే అమలుపరిచేది కాంగ్రెస్ పార్టీ
– మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇస్తే మాటపై నిలబడి అమలు అమలు చేసి రైతు కండ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి అన్నాడు. రెండో విడత 1,50,000 రుణమాఫీ మంగళవారం రైతులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు రుణమాఫీ చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన మాటలో విఫలం చెంది అధికారం కోల్పోయారని అన్నారు. రతులకు రెండో విడతలో 1,50,000 రుణమాఫీ అవడంతో రైతుల కండ్లల్లో ఆనందం చూస్తూ ఇండ్లలో వాళ్ళు పండగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. రెండవ విడత రుణమాఫీలో లక్షన్నర రూపాయల వరకు రుణాలను మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఓట్ల కోసమో.. ఎన్నికల కోసమో రైతు రుణమాఫీ చేయడం లేదని తెలిపారు. ఒకేసారి రైతుల కోసం 31వేల కోట్లు బ్యాంకులకు చెల్లించిన రికార్డు తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తున్న ఈ రెండు నెలలు చరిత్రలో నిలిచి పోతాయని  అన్నారు. గతంలో అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోకూడదనేదే మా విధానం. అందుకే ఇవాళ రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేశాం.రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లల్లో ఇవాళ పండుగ రోజు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసమే సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లు  ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశారు. రెండో విడతగా రూ.6,190 కోట్లు మాఫీ చేశాం అన్నారు. దీంతో రైతన్నలు గ్రామాల్లో హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నారని అన్నారు.
Spread the love