మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి

– జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి
నవతెలంగాణ-కరీంనగర్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నందున ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం2023 లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని వీ కన్వెన్షన్ హాల్లో ఉదయం నిర్వహించనున్న చేనేత వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. వారి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిపి, అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. వి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. అనంతరం అలుగునూరు బ్రిడ్జిపై ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఏసిపి ప్రతాప్, చేనేత జౌలి శాఖ ఆర్జెడి అశోక్ రావు, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love