హీరో సుమంత్ ప్రభాస్ నటించిన సినిమా ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. ఈనెల 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ,’మూడేళ్ల తర్వాత నా సినిమా వస్తోంది. ‘ఎవరైనా టికెట్ కొంటారా?’ అని మా ఫ్రెండ్స్ అన్నప్పుడు నా మనసు కాస్త కళుక్ మంది. కానీ మేము థియేటర్లు విజిట్ చేస్తూ పల్లెటూర్లలో తిరిగి నప్పుడు థియేటర్లలో కనిపించిన ఎనర్జీ మామూలుగా లేదు. ఫ్యామిలీలతో థియేటర్లు కళకళలాడటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘మేం ఫేమస్’ సినిమాను యూత్ కనెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్రకి థ్యాంక్స్. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 12వ రోజు కూడా హౌస్‌ఫుల్ రన్ తీసుకుందంటే అది నిర్మాత అభినవ్ వల్లే సాధ్యమైందిఅని తెలిపారు. 'ఇందులో నేను చేసిన మాయ క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని హీరోయిన్ నిధి ప్రదీప్ చెప్పారు. నిర్మాత అభినవ్ రావు మాట్లాడుతూ, ‘మౌత్ టాక్‌తోనే ఇలాంటి సినిమాలు నిలబడతాయి. ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌తో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సెకండ్ వీక్ నుంచి సినిమాకి మరింత రీచ్ పెరిగిందిఅని అన్నారు. 'సచిన్ టెండూల్కర్ ఒక మాట అన్నారు. ‘ఎవరైనా రాళ్లు విసిరితే, ఆ రాళ్లతోనే మైలురాయి చేసుకోండి’ అని. ఈ సినిమా మాకు అలాంటి మైలు రాయి. 10 రోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ సాధించడం మాకు చాలా గొప్ప విషయం అని డైరెక్టర్ సుభాష్ చంద్ర అన్నారు.
ప్రేక్షకులే మాకు ఈ విజయాన్నిఇచ్చారు..
- Advertisement -
- Advertisement -



