మెమరీ మేకర్స్ బ్యానర్ మీద నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తు న్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ రోల్ పోషిస్తున్న రాశీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సావిత్రి పాత్రలో రాశీ ఓ పవర్ ఫుల్ రోల్‌ను పోషించారు. ఇక ఈ పాత్రకు సంబంధించిన గెటప్, లుక్స్ ఎంత సింపుల్‌గా ఉన్నాయో.. ఆమె లుక్ అంత ఇంటెన్స్‌గా ఉంది. ఈ చిత్రాన్ని మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో రాశీ నటించారు. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీజర్‌ను రెడీ చేస్తున్నట్టుగా టీం తెలిపింది. తొలి సినిమానే అయినా నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి, దర్శకుడు : రవి కుమార్ సీరపు, సంగీతం : శేఖర్ మోపురి, కెమెరా : ప్రియేష్ గురుసామి, ఎడిటింగ్ : శివ శర్వాని, రచన : విక్రమ్ రాజా, లైన్ ప్రొడ్యూసర్ : నితిన్ కుమార్ ఆర్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ప్రియ.



