కొబ్బరి నూనెను కేవలం జుట్టుకే కాకుండా వంటల్లో ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం…
బరువు తగ్గడం – జీవక్రియలు: కొబ్బరి నూనెతో చేసిన వంటలు తింటే జీవక్రియలు వేగంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇది బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, త్వరగా జీర్ణమవుతుంది. శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తి: ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లిపిడ్స్, క్యాప్రిలిక్, క్యాప్రిక్, లారిక్ ఆమ్లాలు హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతాయి.
షుగర్ లెవెల్స్ నియంత్రణ: ఇది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరపరుస్తుంది, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి మందులా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యం: కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తూ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బీపీని సమంగా ఉంచుతుంది. ఇందులో ఉండేవి శాచ్యురేటెడ్ కొవ్వులు కావడం వల్ల ఎటువంటి హాని లేదు.
చర్మ రక్షణ: చర్మ గాయాలపై దుమ్ము పడకుండా చేసి, ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షణ కవచంలా ఉంటుంది.
పచ్చి కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు
పోషక విలువలు: పచ్చి కొబ్బరిలో ఫైబర్ (పీచు పదార్థం), విటమిన్లు, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ముఖ్య ప్రయోజనాలు
జీర్ణక్రియకు సహాయం: కొబ్బరిలోని పీచు పదార్థం (ఫైబర్) మలబద్ధకాన్ని నివాస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యం: పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు (వీజుర) చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.
బరువు నియంత్రణ: దీనిలోని ఫైబర్ త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆకలి, స్నాక్స్ తినడాన్ని అదుపు చేయవచ్చు.
మెదడు పనితీరు: కొబ్బరిలోని కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి.
చర్మ, కేశ సంరక్షణ: కొబ్బరి తీసుకోవడం వల్ల చర్మం తేమగా, మదువుగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి.
గమనిక: కొబ్బరిలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దీన్ని మితంగా (తగిన పరిమాణంలో 50స్త్రతీఎర -70 స్త్రతీఎర ) తీసుకోవడం చాలా మంచిది.
వాణి అయోధ్య క్లినికల్ డైట్ కన్సల్టంట్
9959361180


