
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ బోధన అందుతుందని ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమి చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ బుక్ లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య బోధన అందుతుందని, ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సార్ పాఠశాలల్లో విద్యుత్ తో పాటు నాణ్యమైన ఉచిత మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు అందించడంతోపాటు ఎన్నో సౌకర్యాలను, వసతులను విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న చేర్పించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.