బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి..

నవతెలంగాణ- ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఒక బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. బాలుడుపై ఇరుకైన సందులో వీధికుక్కల దాడి చేసాయి. ఓ భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోను చూస్తుంటే, ఈ సంఘటన కెమెరాలో రికార్డు కాక ముందు నుంచే బాలుడిని కుక్కలు వెంబడిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, చిన్న పిల్లవాడిని చుట్టుముట్టిన ఆ కుక్కలు అతనిపై దాడి చేస్తూ ఎక్కడపడితే అక్కడ కొరికాయి. లేన్ చివరకి చేరుకున్న ఒక జంట, పిల్లవాడి ఏడుపు విని వెనక్కి వచ్చారు. ఆ సమయానికి, ఒక మహిళ చేతిలో కర్రతో వస్తూ కనిపించింది. దీంతో పిల్లవాడిపై దాడి చేస్తున్న ఐదు కుక్కలు అక్కడ్నుంచి పారిపోయాయి. ఆ తర్వాత, బాలుడు తనను రక్షించిన మహిళ వైపు పరుగెత్తాడు. బాలుడు ఏడుస్తూ ఆమెను కౌగిలించుకోవడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అప్పటి వరకు కుక్కలు చిన్నారిపై దాడి చేయడంతో స్థానికులు గుమిగూడి, జరిగి విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు, షాక్ స్థితిలో ఉన్నాడు. కుక్కకాటు నుంచి కోలుకున్న తర్వాత అతనికి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు.

Spread the love