Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

- Advertisement -

నిప్పులా కుంపటిలా ఎండలు
బేజారవుతున్న జనం
నవతెలంగాణ – మల్హర్ రావు

ఊపిరాడనివ్వని ఉక్కపోత..మాడు పగిలేలా దంచి కొడుతున్న ఎండలు.. చెవుల్లో నిప్పులు పోసినట్లు వీచే వేడిగాలులు ఉదయం మధ్యాహ్నం రాత్రి తేడా లేకుండా రెండు వారాలుగా వేడెక్కుతున్న వాతావరణం ప్రతీ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఉదయం పది గంటలకే ఎండదంచి కొడుతుండగా మధ్యాహ్నం అప్రక టిత కర్ఫ్యూను తలపిస్తోంది.ఇందుకు తోడుగా అప్రకటిత కరెంట్ కోతలు మెదలైయ్యాయి.సాయంత్రం వేడి గాలులు వీస్తుండగా. పగలూ రాత్రి లేకుండా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమో దవుతున్నాయి.దీంతో ప్రజలు ఎండలకు బేజారు అవుతున్నారు.ఉదయం,సాయంత్రం పనులు పూర్తిచేసుకుని, మధ్యాహ్నం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు.

ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి..
మండలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో ప్రజలు ఉష్ణతాపాన్ని భరించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి.ఇప్పటికే 42 డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో 43 డిగ్రీలు దాటే అవకాశం ఉంది.ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.రోజంతా జనంతో రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

ఇళ్లకే పరిమితమవు తున్న జనం..
భానుడి తాపంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.ఉద్యోగులు మినహాయించి బయట పనులకు వెళ్లినవారు ఉదయం 11 గంటలలోపు ఇళ్లకు చేరుకుంటున్నారు.గతంలో కన్నా ఈసారి ఎండల తీవ్రత పెరగడం,గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లోనూ వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు.అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు.రాబోయే 4 రోజుల్లో 43 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -