నివాళులు అర్పించిన సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ-అచ్చంపేట
లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన చిట్టిగొండ అలివేలు మృతి చెందడం బాధాకరమని సీపీఐ(ఎం) పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యా నాయక్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు లింగాల మండల కార్యదర్శి ఎం.శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం రాయవరం గ్రామానికి వెళ్లి అలివేల భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాయవరం గ్రామంలో బుడ్డయ్య అలివేల దంపతులిద్దరూ కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారని, పేదరికంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్ పట్టణంలో గత 30 నుండి 40 సంవత్సరాలుగా బాగ్ లింగంపల్లి డివిజన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కల గల లంబాడి తండాలో అనేక సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవించడంతో అక్కడ వారికి ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసిందని చెప్పారు. పుట్టిన ప్రాంతమైన రాయవరం గ్రామంలో తమ బంధాన్ని కొనసాగించారని తెలిపారు. రాయవరం గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటానికి, తమ కుటుంబం కృషి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు నాగరాజు, సైదులు, మండల నాయకులు లాల్ మహ్మద్, బాల్రాజ్ స్వామి, సురమంద, లక్ష్మయ్య, దేవుడు తదితరులు ఉన్నారు.
చిట్టిగొండ అలివేల మృతి బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



