కొత్త బస్టాండ్ దగ్గర మురికి కల్వర్టును వెంటనే మూసివేయాలి

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ బాబు జగజ్జివన్ రావు విగ్రహం దగ్గర ఉన్న మురికి కాలువను వెంటనే మూసివేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి. కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేస్తూ.. సోమవారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కాలువను పరిశీలించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గత 3,4 సంవత్సరాలు నుండి బస్టాండు సెంటర్లో ఈ కాలువను ముసివేయకుండ అలాగే ఉంచుతున్నారు అన్నారు. ఈ కాలవ సూర్యాపేట బస్టాండ్ చౌరస్తాలో ఉండటం ఇక్కడ ఎప్పుడు జనసంచారం, వాహనాలతో రద్దీగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు. అదేవిధంగా దీని పక్కనే అనేకమంది బతుకుతెరువు కోసం చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు,పాన్ షాపులు, టి స్టాళ్లు పెట్టుకొని జీవిస్తున్నా పట్టించుకోకుండా, రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఈ కలువని మూయకుండా అలాగే ఉంచి వివిధ కారణాలు చూపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారు అన్నారు. ఈ కాలువ అలాగే ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న జనాలకు అక్కడి నుండి వెల్లె వాళ్లకు ఆదుర్గంధపు వాసన పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి అన్నారు. ఇకనైనా మునిసిపాలిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి మురికి కాలువ పనులు పూర్తి చేసి ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వీరబోయిన రమేష్,పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్,వాజిద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love