– నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ
– బేగంపేటలో బీఆర్ఎస్ నుండి కాగ్రెస్ లోకి పలువురి చేరికలు
నవతెలంగాణ – బెజ్జంకి
నీళ్లు,నిధులు,నియామకాల కోసం ప్రజలు చేసిన పోరాటాలు,అమరుల త్యాగాలు,అకాంక్షలను నెరవేర్చాలనే సదుద్ధేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రజల కలలు అవిరయ్యాయని కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు,మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.బుధవారం మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కవ్వంపల్లి సత్యనారాయణ హజరై పలువురు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడారు.కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అనంతరం అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభిష్టాల్ని విస్మరిస్తూ వారి స్వార్థ రాజకీయ అధికార లబ్దికోసం రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నీరుగార్చి.. అభివృద్ధి పేరుతో ప్రజాధనం దోపిడీ చేయడమే ప్రధాన ద్యేయంగా పరిపాలన సాగిస్తుందన్నారు.నాటి ఎన్నికల సమయంలో అధికారం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.లక్ష రైతు రుణమాఫీ,ఆర్హులైన దళితులకు మూడెకరాల భూమి,నిరుద్యోగ భృతి,ఉచిత ఎరువులు, వ్యవసాయ సాగు యంత్రాల్లో సబ్సిడీ,కేజీ టు పీజీ ఉచిత విద్య హామీలను విస్మరించి దళిత బందు,బీసీ సహయం వంటి పథకాలతో మరోసారి ప్రజలను మభ్యపెట్టి అధికారం కోసం పాకులాడుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం కోసం సామాన్యుల ఓట్లే కీలకమని గ్రహించిన సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో మరెన్నో పథకాలతో ముందుకు వచ్చి ప్రలోభాలకు గురిచేస్తాడని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమాజం మెల్కోని అంబేడ్కర్ రాజ్యాంగం ద్వార లబించిన వజ్రాయుధమైన ఓటును సద్వినియోగం చేసుకుని బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ పాలనకు పట్టం కట్టాలని కోరారు.మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్,నాయకులు పులి కృష్ణ, శానగొండ శ్రావణ్,రొడ్డ మల్లేశం,జనాగం శంకర్,మాజీ యువజన మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,కార్యకర్తలు హజరయ్యారు.