- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
భూమిపై సర్వ జీవుల మనుగడకు ఆధారం పర్యావరణమేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్క నాటి సంరక్షించాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని గూడెం గ్రామంలో వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల అవరణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటా మొక్కలు పంపిణి చేశారు. ఉప సర్పంచ్ యాలాల పర్శరాం, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరోజన, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



