కొడంగల్‌ స్ట్రాంగ్‌ రూమ్‌కి చేరుకున్న ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు

నవతెలంగాణ-కోడంగల్‌
కోడంగల్‌లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి రెండు ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాట్లు కోడంగల్‌కి చేరుకున్నాయి. కోడంగల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లింగ్యా నాయక్‌ పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాడ్లు స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. 343 బ్యాలెట్‌ ఈవీఎంలు, 385 వీవీ ప్యాడ్లు, కంట్రోల్‌ యూనిట్లు 343 పోలింగ్‌ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. వీటిని అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ, ప్రత్యేక పోలీసు రక్షణ స్ట్రాంగ్‌ రూములలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూములో ఈవీఎంలను భద్రత పరిచి గదులను సీజ్‌ చేశారు. పోలింగ్‌ రోజు మాత్రమే ఈవీఎంలు, వీవీ ప్యాడ్లను ఆయా పోలింగ్‌ స్టేషన్లకు తరలిస్తామని కోడంగల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లింగ్యానాయక్‌ తెలిపారు. గట్టి పోలీసు భద్రత, సాంకేతిక నిఘా పర్యవేక్షణలో ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉంటాయన్నారు. 24 గంటల పాటు స్ట్రాంగ్‌ రూములకు పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్‌ విజరుకుమార్‌, దౌల్తాబాద్‌ మండల తహసీల్దార్‌ విజరుకు మార్‌, సీఐ రాములు, ఎస్సై భరత్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, ఆర్‌ఐ శృతి, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love