నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.( ఎంఏ, ఎం. కాం, ఎం.ఎస్. డబ్ల్యూ , ఎం.ఎస్సి, ఎం.బీ.ఏ , ఎం.సీ.ఏ )పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు ల ( ఐ.ఎం.బీ.ఏ , ఏ.పి.ఈ,పి.సి.హెచ్ ) ఏడవ, సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం www.telanganauniversity.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.