భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలు.. ఆరుగురు ఆఫీసర్లపై ప్రభుత్వం వేటు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గనులు, భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలతో ఆరుగురు అధికారులపై వేటేసింది ప్రభుత్వం. గనుల శాఖలో డిప్యుటేషన్ పై జీఎంలుగా పని చేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్స్ దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ లను మాతృ సంస్థలకు బదిలీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, ఆక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది.

Spread the love