ఇండ్ల స్థలాలకు పట్టాలు వచ్చేవరకు ఉద్యమించాలి

– తుమ్మల వెంకటరెడ్డి సీపీఎం ములుగు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
సుందరయ్య నగర్ లో ఘనంగా గుడిసెల ఆవిర్భావ సభ ఏర్పాటుచేశారు. ఇళ్ల స్థలాలకు పట్టాలు వచ్చేవరకు గుడిసె వాసులు ఉద్యమించాలని సీపీఐ,ఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పసర గ్రామం సుందరయ్య నగర్ లో గుడిసె వాసులు మొట్టమొదటి ఆవిర్భావ సభను కడారి నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య నగర్ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. పేదలు ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారని, వారికి వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సుందరయ్య నగర్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, రోడ్లు డ్రైనేజీ కరెంటు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రజలు తమ ఐక్యత ద్వారానే హక్కులు సాధించబడతాయని అందుకోసం ప్రజలు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ముగ్గుల పోటీ లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు . ప్రథమ బహుమతి వర్ధం  అచ్చమ్మ ద్వితీయ బహుమతి కొమ్ము సమ్మక్క తృతీయ బహుమతి ఊకే సమ్మక్క అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్ చిట్టిబాబు మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి మండల కమిటీ సభ్యుడు సోమ మల్లారెడ్డి నాయకులు ఉపేంద్ర చారి పల్లపురాజు మంచోజు బ్రహ్మచారి ప్రభాకర్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కారం రజిత ఉపాధ్యక్షురాలు మంచాల కవిత గ్రూప్ లీడర్స్ రాజేశ్వరి సువర్ణ స్వరూప శారద రాంబాబు కొమ్ము రాజు జుట్టబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love