Sunday, April 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహార్టికల్చర్‌ సీట్ల పెంపు రద్దు చేయాలి

హార్టికల్చర్‌ సీట్ల పెంపు రద్దు చేయాలి

- Advertisement -

– అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన
నవతెలంగాణ- రాజేంద్రనగర్‌

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో హార్టికల్చర్‌ సీట్ల పెంపునకు నిరసనగా శ్రీ కొండా లక్ష్మణబాపూజీ ఉద్యానవన కళాశాల విద్యార్థులు శనివారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీట్ల పెంపును వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్స రం నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో 30బీఎస్సీ హార్టికల్చర్‌ సీట్లు, 8ఎంఎస్సీ సీట్లు కేటాయించ నున్నట్టు వచ్చిన సమాచారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హార్టికల్చర్‌ కోర్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తున్న యూనివర్సిటీ ఉండగా, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆ కోర్సులకు సీట్లు కేటాయించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. 2007 కంటే ముందు ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కలిసి ఉండేవని చెప్పారు. ఉద్యాన ప్రాముఖ్యత ఉందని నాటి సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ఈ చర్య వల్ల హార్టికల్చర్‌ యూనివర్సిటీ ప్రాముఖ్యత దెబ్బతింటుందని, విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారంరోజుల్లోగా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. హార్టికల్చర్‌ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -