గ్రామ పంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలి…

నవతెలంగాణ -చివ్వేంల: గ్రామ పంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ  జిల్లా కార్యదర్శి నెమ్మాది  వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెలో భాగంగా  శుక్రవారం చివ్వేంల  మండల కేంద్రము లోని ఎంపీడీఓ కార్యాలయం ముందు చేస్తున్న సమ్మె లో పాల్గొని మాట్లాడారు.  గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రత పాటించడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గ్రామ పంచాయితీ కార్మికుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మల్టిపర్పస్ విధానం తెచ్చి కార్మికుల మెడపై కత్తి పెట్టారని, కార్మికుల ప్రాణాలు తీస్తున్న జీవో 51ని వెంటనే రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. జీవో 60ప్రకారం జీతాలు పెంచాలని, కేటగిరి వారిగా   వేతనాలు పెంచాలని, ప్రతి కార్మికునికి ప్రమాద బీమా, పర్మినెంట్ చేయాలని, కోరారు. సమ్మెలో కార్మికులందరూ  ఐక్యత ఉండాలని  సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి నాయకులు  వేల్పుల వెంకన్న, గ్రామపంచాయతీ కార్మికుల సంఘనాయకులు  బిక్షం, సాగర్, శ్రీను, వెంకన్న, పూలమ్మ,రాంబాబు, కృష్ణ, మంగ్యా, తిర్పతమ్మ, ఉప్పలయ్య, వీరమ్మ, వెంకన్న, ఈదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love