స్థానిక మండల ప్రజలను తాడ్వాయి ఆర్చ్ గేట్ ద్వారా భక్తులను పంపించాలి

నవతెలంగాణ – తాడ్వాయి
స్థానిక తాడ్వాయి మండల కాటాపూర్, గంగారం, బీరెల్లి, రంగాపూర్, దామరవాయి, నర్సాపూర్ గ్రామాలలోని భక్తులు స్థానిక మండలంలో గల మేడారం వనదేవతల దర్శనానికి 50 కిలోమీటర్ల దూరం నుండి పస్రా మీదుగా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని, స్థానిక మండల భక్తులను తాడ్వాయి మండలంలోని హార్ట్ గేట్ ద్వారానే పంపించాలని భక్తులు సంబంధిత ఉన్నతాధికారులను కోరుకుంటున్నారు. మేడారం మహా జాతర స్థానిక మండల కేంద్రంలోని మేడారంలో జరుగుతుంది. ఈ స్థానిక గ్రామాల ప్రజలు ఎక్కడినుండో చుట్టూ తిరిగి సుమారు 50 నుండి 70 కిలోమీటర్ల దూరం నుండి మేడారం చేరుకోవాలంటే భక్తులు నానా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ములుగు ఎస్పి శబరిస్, ఐటీడీఏ పీవో అంకిత్ లు పునః రా లోచించి స్థానిక మండల ప్రజలను తాడ్వాయి హార్ట్స్ నుండి పంపించాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క కూడా ఆలోచించి ఈ మార్గం ద్వారా భక్తులను పంపించే విధంగా చేయాలని కోరుతున్నారు.

Spread the love