తైపీ ఓపెన్‌లో ముగిసిన‌ ప్ర‌ణ‌య్ పోరాటం

నవతెలంగాణ – హైదరాబాద్: తైపీ ఓపెన్‌లో నిలిచిన‌ ఏకైక‌ భారత స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఓట‌మితో ఇంటిదారి ప‌ట్టాడు. హాంకాంగ్‌కు చెందిన అంగుస్ కా లాంగ్‌ చేతిలో ప్ర‌ణ‌య్ ఓడిపోయాడు. రెండు సెట్లలో ఆధిప‌త్యం చెలాయించిన లాంగ్ భార‌త ఆట‌గాడికి అవ‌కాశం ఇవ్వ‌లేదు. 19-21, 8-21తో విజ‌యం సాధించాడు. ఈ టోర్నీలో టైటిల్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగిన ప్ర‌ణ‌య్ తొలి రౌండ్ నుంచి దూకుడు క‌న‌బ‌రిచాడు. 2014 వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో కాంస్య ప‌త‌కం నెగ్గిన టామీ సుగియ‌ర్టోపై 21-9, 21-17తో గెలిచి ప్ర‌ణ‌య్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టాడు.

Spread the love