రైతులకు సాగు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం

– దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.
నవతెలంగాణ-తొగుట : వ్యవసాయమే జీవనదరంగా జీవిస్తున్న రైతులకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనం,నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకు,కస్తూర్బా బాలికల పాఠశాల భవనం ప్రారంభించారు.అంతకు ముందు రైతులు యసంగి పంటలు సాగు చేసేందుకు మల్లన్నసాగర్ జలాశయం నుండి దుబ్బాక కేనాలకు నీరు విడుదల చేశారు.అనంత రం ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చా రని తెలిపారు. రైతుల పట్ల చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి ఉన్న చిత్త శుద్ది కి  తాను సంతోషం వ్యక్తం చేస్తు న్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు.దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా ఇన్చార్జి మంత్రి గా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంటుందని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చా రు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి వంద రోజు లు కూడా కాలేదని, అప్పుడే ప్రతి పక్షాలు తమ ఆరు గ్యారెంటీ లపై గగ్గోలు పెట్టడం సరికాదన్నా రు. ఎన్నికల హామీలను తప్పక నెరవేరుస్తామని ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదన్నా రు. ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఈఎన్స్ హరే రాం,ఈఈ సాయిబాబా, డిఈఈ శ్రీనివాస్ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రేడ్డి, పూజల హరికృష్ణ, ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అక్కం స్వామి, తోగుట గ్రామ సర్పంచ్ పాగల కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love