– పీఆర్సీ చైర్మెన్‌కు టీఎస్టీయూ ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.69,150 నిర్ణయించాలని టీఎస్టీయూ కోరింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ చైర్మెన్ ఎన్ శివశంకర్, సభ్యులు బి రామయ్యను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి శుక్రవారం కలిసి ప్రతిపాదనలను సమర్పించారు. 35 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన స్థిరీకరణ చేయాలనీ, గతేడాది జులై ఒకటి నుంచి ప్రకటించాలని కోరారు. ఎస్జీటీ, భాషా పండితులు, పీఈటీ తదితర పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ల వేతనంతో పోలిస్తే అంతరం పెరిగిందనీ, దాన్ని తగ్గించాలని తెలిపారు. అప్రయత్న పదోన్నతి పథకాన్ని 4/8/12/16/20/24గా నిర్ణయించాలని పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ఏ గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం, మున్సిపాల్టీల్లో 17 శాతం, కార్పొరేషన్, జిల్లా కేంద్రాల్లో 20 శాతం, హెచ్‌ఎండీఏ పరిధిలో 25 శాతం ప్రతిపాదించాలని సూచించారు. గ్రాట్యూటీ రూ.25 లక్షలకు పెంచాలని తెలిపారు.