Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిప్పు తొక్కిన కోతిలా విపక్షం..

నిప్పు తొక్కిన కోతిలా విపక్షం..

- Advertisement -

రైతులకు మేలు జరగొద్దని బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా, నగర కాంగ్రెస్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, టీపీసీసీ అధ్యక్షులుమహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

అధికారం లేక విపక్షం నిప్పుతొక్కిన కోతిలా విలవిల్లాడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తున్నామని, నీటి పారుదల ప్రాజెక్టులు, హామ్‌ విధానం ద్వారా వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా, నగర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంగళవారం భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్‌ అధ్యక్షతన సంజీవరెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగించారు. రైతులకు మేలు జరగొద్దని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భారత రాజ్యాంగం అందించిన సమానత్వం, హక్కులను కాపాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి నూతన కార్యవర్గ సభ్యులు పనిచేయాలి అని సూచించారు. దేశంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో బాధ్యతలు స్వీకరించడం ఒక గౌరవంగా భావించాలి అని తెలిపారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికితే తమ ఉనికి ఉండదన్న భయంతోనే ప్రతిపక్షాలు ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకంపై విషప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

కేటీఆర్‌.. మీ చెల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పు.. :
టీపీసీసీ అధ్యక్షులు
మహేశ్‌ కుమార్‌గౌడ్‌

మాజీ మంత్రి కేటీఆర్‌.. తన చెల్లెలు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో 70 ఏండ్ల కిందట కట్టిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రెండేండ్లకే దెబ్బతిన్నదని విమర్శించారు.

చేసిందీ చెప్పుకోలేకపోతున్నాం.. : మంత్రి పొంగులేటి
గత పాలకులు గోరంత చేసి కొండంత చెప్పుకున్నారు.. కానీ మన ప్రభుత్వం కొండంత అభివృద్ధి చేస్తున్నా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి ఉన్నాంద రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే నేడు మనం అధికారంలో ఉన్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -