ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలకు చరమగీతం పాడాలి

ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలకు చరమగీతం పాడాలి– జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ఆకునూరి మురళీ
నవతెలంగాణ-నల్లబెల్లి
అసమర్ధత, అబద్ధాల, అహంకారంతో పాటు మత విద్వేష, ఫాసిస్ట్‌ పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని మో డీ సర్కారు, అవినీతి నియంతత్వ కేసీఆర్‌ పాలనను ఓ డించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళీ అన్నారు. మండల కేంద్రంలో జాగో బస్సు యా త్ర 17వరోజు ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ కూడలిలో గు రువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమా న్ని ఉద్దేశించి జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళీ మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను వేలకోట్ల కుంభకోణం తో కేసీఆర్‌ కుటుంబం తన్నుకుపోయిందని అన్నారు. కా ళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ పేరిట అడ్డు అదుపు లే ని అవినీతి జరిగిందని అవినీతి ఫలితంగానే ప్రాజెక్టు కుంగి పోయిందన్నారు. నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థానాలు, కార్మి కుల కనీస వేత నాలు అందలేద న్నారు. రైతు బం ధు రైతులు కానీ వారి జేబులు నిం పుతుందని విమ ర్శించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షను వమ్ము చేసిన నియంతత్వ కేసీఆర్‌ పాలలను ఓడించి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న నల్లధ నాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తానని ఏ టా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని భారీ ఏజెండాను ప్రకటించి మొండి చేయి చూపించిందన్నారు. బడా కా ర్పొరేట్‌ కంపెనీలకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసిందని విమర్శించారు. ప్రజల మధ్య కులమత బేధాలు రెచ్చగొట్టే విధానాలు అమలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. మోడీ విధానాలను 9 ఏళ్లుగా కేసీఆర్‌ సమర్థిస్తూ వస్తున్నా రని వీరికి మతతత్వ ఎంఐఎం పార్టీ మద్దతిస్తుందన్నారు.
ఈ మూడుపార్టీలు పర స్పరం సహకరించుకుంటూ ఓట్లు, సీట్లు, రాజకీయం చేస్తున్నారని తెలిపారు. దేశం లో, రాష్ట్రంలో దేశ సంపదను దోచుకుంటూ కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగి స్తున్న మోడీ, కేసీఆర్‌ సర్కార్లను ఓడించాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ పద్మజ, ప్రొఫెసర్‌ వినాయక రెడ్డి, ప్రొఫెసర్‌ రమా, వైనాల గోవర్ధన్‌, అమ్మే ష్‌ డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి శంకర్‌, పులి కల్పన, స్వరూప, నిర్మల, సంధ్య, సౌజన్య, గౌస్‌, బాలు, రాము, వినరు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love