రహదారులే రైతుల ధాన్యం కల్లాలుగా..!

నవతెలంగాణ-గోవిందరావుపేట
రహదారులే రైతులకు దాన్యం కల్లాలుగా మారుతున్నాయి. రహదారుల వెంట పొడవున ఖాళీ స్థలం కనిపించడంతో ధాన్యాన్ని ఆరబోసేందుకు అనువుగా ఉందని రైతులు రహదారులను ఆశ్రయిస్తున్నారు. మండల వ్యాప్తంగా రైతులు సుమారు 15 వేల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేస్తున్నారు. గతంలో రైతులు ఎవరి పొలంలో వారు పంట కోసి కుప్ప వేసి నూర్పిడి చేసుకునేవారు. ప్రస్తుత పరిస్థి తుల్లో మారిన కాలానికి అనుగుణంగా యాంత్రిక విధానం అమలులోకి వచ్చినాటి నుండి యంత్రాలు పంటను కోయడం వల్ల కొయ్యకాలు ఎత్తుగా ఉండి రైతుల పొ లంలో ధాన్యం ఆరబోసేందుకు అనుకూలంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి తోలుదామంటే ఎక్కడా కూడా విశాలమైన ధాన్యం కొ నుగోలు కేంద్రాలు లేవు. ఒక 20 మంది రైతులు 50 ఎకరాల ధాన్యాన్ని ఆరబోశా రంటే ఆ కొనుగోలు కేంద్రంలో ఆ ధాన్యం ఆరి కాంటాలు,లోడ్‌ అయివెళ్లిన తర్వాతే మరి కొంతమంది రైతులకు ధాన్యం ఆరబోసుకునే అవకాశం లభిస్తుంది. ఒకే గ్రా మంలో వేలాది ఎకరాల్లో రెండు మూడు రోజుల్లోనే పంట పొలాలను కోయడం వల్ల దాన్యం ఆరబోసుకునేందుకు స్థలాల కరువు నెలకొంది. తప్పని పరిస్థితిలో రైతులు రహదారులను ఆశ్రయిస్తున్నారు. కలెక్టర్‌ అధికారులు మంత్రులు సంవత్స రాల తరబడి చూస్తున్న రహదారుల వెంట ప్రమాదాలు జరుగుతున్న ప్రత్యామ్నా య మార్గాలను రైతులకు సూచించకపోవడం విచారకరమని రైతు సంఘాల నా యకులు అంటున్నారు. ఇప్పటికైనా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబోసే విధానానికి స్వస్తి చెప్పించి ప్రమాదాల నివారణకు సహకరించి వాహనచోదకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడా లనీ రైతులు అంటున్నారు. ధాన్యం కోసి పొలంలో ఆరబోయేలేని పరిస్థితి, ఇంటికి తోలి ఆరపోద్దామంటే ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండదు, స్థలం ఉన్నవారికి తరలిం చేందుకు వాహనం వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో నే రహదారుల వెంట ఉండే ఖాళీ స్థలాన్ని ఆశ్రయిస్తున్నామని రైతులు తెలుపుతు న్నారు. ప్రస్తుతం చలువాయి ప్రాంతంలో చల్వయి నుండి మొదలుకొని గోవింద రావుపేట వరకు రైతులు జాతీయ రహదారి వెంట ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలంలో ధాన్యాన్ని ఆరపోసుకొని ఆరిన వెంటనే కాంటాలు వేసి తరలిస్తున్నారు. ఇది తాత్కాలిక మే అని శాశ్వతంగా పర్మినెంట్‌గా రైతాంగం ధాన్యం ఆరబోసుకునేం దుకు అవసరమైన స్థల సేకరణ ప్రభుత్వం చేసి అందించినట్లయితే ప్రభుత్వ ప్ర యత్నాలు హర్షిస్తామని రైతు సంఘాల రైతులు అంటున్నారు.
ప్రతీ గ్రామానికి ధాన్యం ఆరబోసుకునేందుకు పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలి : బుడిగె రఘు, చల్వాయి రైతు
రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని కే టాయించాలి. ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనం క్రీడ మైదా నాలను నిర్మించినట్లే రైతులకు సదుపాయాలను కల్పిస్తూ ధా న్యం ఆరబోసుకునేందుకు వీలు కల్పించాలని,అక్కడే ధాన్యం ఖరీదులు కాంట లోడు చేయించే విధంగా చర్యలు చేపట్టాలి. రైతులు ఎదుర్కొం టున్న ధాన్యం ఆరబోత సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.

Spread the love