బచ్చన్నపేట ఎస్సై నవీన్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ భూకబ్జా దారులకు కొమ్ముగాస్తున్న బచ్చన్నపేట ఎస్సైని వెం టనే సస్పెండ్‌ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమా వేశం రాపర్తి రాజు అధ్యక్షతన జరగగా కనుకారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బచ్చన్నపేట మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడైన గిర బోయిన అంజయ్య అక్రమాలకు భూకబ్జాలకు పాల్ప డుతుంటే అతనికి సహకరిస్తూ రాజ్యాంగ విలువల ను కాపాడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తు న్న సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్‌, రామగల్ల అశోక్‌, మినులపురం ఎల్లయ్య, కంత్రి ఐల య్య, నరసింహులుపై అక్రమంగా బైండోవర్‌ కేసు లు పెట్టి ఎస్సై ఆప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నా రని విమర్శించారు. బచ్చన్నపేట మండలం చిన్న రా మచంద్రం గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రస్తుతం గోపా ల్‌ నగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోగల 174 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు గత సంవత్సరం క్రితమే ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన అంజయ్య కుటుంబం అక్రమంగా సాగుచే స్తూ భూమి ఆక్రమించుకొని అక్రమాలకు పాల్పడు తుంటే అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం మండల కమిటీ గత సంవత్సర కాలంగా ప్ర భుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగు తుందన్నారు. అయినప్పటికీ అధికారులు అట్టి భూ మిని స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం ఫలితంగా కోట్ల విలువ చేసే భూమి కొల్లగొట్టే ప్రయ త్నంలో అధికార పార్టీ నాయకుడు చేస్తున్నారని అన్నా రు. దానికి ఎస్‌ఐ నవీన్‌ కుమార్‌ సహకరిస్తూ భూమి మీద పోరాటం చేస్తున్న నాయకులను ప్రజలను బెది రిస్తున్నారన్నారు. భూ పోరాటం చేస్తున్న సీపీఎం నా యకులతో ఏసిపి మాట్లాడతాడట అని ఫోన్‌ చేసి పి లిపించుకొనిఅక్కడ వెళ్లిన తర్వాతబలవంతంగా తహ సిల్దార్‌ వద్దకు తీసుకెళ్లి సీపీఎం నాయకులపై బైండో వర్‌ కేసు పెట్టడం అప్రజాస్వామికమన్నారు.ఇలాంటి కేసులకు సీపీఎం భయపడేది లేదని ఆ భూమి పేద ల దక్కింతవరకు సీపీఎం పోరాటం చేస్తుందని చె ప్పారు. ప్రభుత్వం పంచకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పేదల గుడిసెలు వేయించి అట్టి భూమిని పేదలకు పంచుతామని హెచ్చరించారు. బచ్చన్నపేట ఎస్సైనీ సస్పెండ్‌ చేయాలని ఆదివారం రోజున జిల్లా వ్యాప్తం గా మండల కేంద్రాల్లో నిరసన తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జి ల్లా కార్యవర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, అహ ల్య, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్‌, సుంచు విజేందర్‌, పి.ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love