మోసం చేసిన పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలి

– అహంకారి అరవింద్ ను ఓడించాలి 
– కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఇక్కడి ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలియవు 
– మాజీ మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే  వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
సాధ్యం కాని,అలవి కానీ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ను మోసం చేసిన పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే  వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన బిఆర్ఎస్ పార్టీ  నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరపున  మండలంలోని ఉప్లూర్, మండల కేంద్రంలో ర్యాలీ, సీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని,అలవి కానీ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ను మోసం చేసిండన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలకు, ఇస్తున్న పథకాలకు రెండింతలు ఇస్తానని చెప్పి మోసం చేసిండు అన్నారు.రేవంత్ రెడ్డి జుట మాటలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి చూద్దాం అని ప్రజలు అనుకుంటే ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేదని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు.ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి, ఎంపీగా అర్వింద్ ఈ ప్రాంత ప్రజల కష్టా సుఖాలు  ఏనాడు పంచుకోలేదన్నారు. కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థికి ఇక్కడి ప్రజల కష్టాలు తెలియవన్నారు.
ఏం చేయకపోయినా ప్రజలు మోడీ పేరుతో తనను గెలిపిస్తారని కలలు కంటున్న అహంకారి  అర్వింద్ ను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు ఓడించాలన్నారు.  అప్పుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తిరస్కరిస్తారని భయం పుడుతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజరెడ్డి రెడ్డి గోవర్థన్ కు ఇక్కడి ప్రజల కష్టసుఖాలు తెలుసన్నారు.అనుభవం ఉన్న నాయకుడు, ప్రజల మధ్య ఉండే నేత ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.దేశంలో అబద్ధాలు అడే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎలక్షన్ లు ఉన్నప్పుడే ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయడం లేదు..ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓట్లు వేశాక వీరు హామీలు అమలు చేస్తారా?ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వీడియోలు సభలో ప్రదర్శించారు. ప్రజలు, రైతులు కేసీఆర్ ను వదులుకొని బాధపడుతున్నారని, ప్రజలు  పార్లమెంటు ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీ కీ బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు.రైతులను, మహిళలను, యువతకు  అనేక హామీలు ఇచ్చారని, ఈ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలంటే ప్రశ్నిచే కేసీఆర్ సైనికుడు బాజిరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అంతకుముందు ఉదయం వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్, కోమన్ పల్లి, కుకునూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలను కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ఎల్ ఎం బి రాజేశ్వర్, ఆయా మండలాల ప్రజాపతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love