ఎంపీతో నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదు 

– బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్
నవతెలంగాణ – బెజ్జంకి
ఎంపీ బండి సంజయ్ కుమార్ తో కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్ సోమవారం ఆరోపించారు. ఎంపీగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారం,అభివృద్ధికి తొడ్పాటును అందిస్తాడని నమ్ముకుంటే..ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి రాష్ట్రంలో తన పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాడని మోహన్ ఎద్దేవా చేశారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు ఎన్నుకోవాలని మోహన్ విజ్ఞప్తి చేశారు.

Spread the love