విప్లవోద్యమాన్ని ప్రజలే కాపాడుకుంటారు

నవతెలంగాణ-గూడూరు
పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగు నింపటానికి జరుగుతున్న భారత విప్లవ ఉ ద్యమంలో ప్రజలు అనేక త్యాగాలు చేసి కాపాడుకున్నారని సిపిఐ(ఎంఎల్‌) ప్రజా పందా ఉమ్మడి వరంగల్‌ జిల్లా సీనియర్‌ నాయకులు పూనెం ప్రభాకర్‌ అన్నా రు.పార్టీ సానుభూతిపరురాలు బొమ్మోజు సర్వస్వతమ్మ సంతాప సభ నేడు మట్టే వాడ గ్రామంలో కే సముద్రం సంయుక్త మండలాల సహకరించి పైన్ల యాకయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సంతాప సభ ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభాకర్‌ మా ట్లాడుతూ ప్రజలు విప్లవద్యమంలో భాగస్వాములు విప్లవ పార్టీల కార్యకర్తలను క న్న బిడ్డల కంటే ఎక్కువగా కాపాడుకున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు పోలీసులు పల్లెలపై పడి విప్లవ కార్యకర్తలను పట్టుకోవడానికి చేసిన ఎన్నో కుట్రలు వ్యక్తుల నుండి ప్రాణాలకు తెగించి కాపాడుకున్నారన్నారు.పాలకవర్గాలు నేడు ప్రజలను ముఖ్యంగా పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల వారిని తీవ్ర నిర్లక్ష్యం చే స్తున్నారని అన్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కుట్రలో భాగంగా కులాల మ ధ్య అడ్డుగోడలు కట్టుకుంటూ కుల చైతన్యాన్ని పెంచుకుంటూ చైతన్యాన్ని మధు బారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ఐక్యమై మార్కిజం, లేనినిజం, మా వో ఆలోచన విధానాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని అప్పుడు మాత్రమే పేద లపై సాగుతున్న దోపిడీ అని చేత వివక్షత దూరం అవుతాయని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంత విప్లవోద్యమంలో గూడూరు మండలంలో మట్టేవాడ గ్రామానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. కామ్రేడ్‌ చంద్రన్న,కామ్రేడ్‌ ప్రభాకర్‌ అన్న అనేక ఇతర దళాలకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చిన గొప్ప తల్లి సరస్వతి అని అన్నారు. ఆమె మరణం మట్టేవాడ గ్రామానికి కాకుండా ప్రజాపంద పార్టీకి కూడా తీరని లోటు అని అన్నారు.

Spread the love