దుబ్బాక నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

– బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి

నవతెలంగాణ -రాయపోల్
రాబోయే శాసనసభ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని దానికోసం ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కలిసికట్టుగా పనిచేయాలని దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలలోని వడ్డేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఉప ఎన్నికలలో మనకు జరిగిన మోసం వల్ల మనం చాలానష్టపోయామని నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందన్నారు. కార్యకర్తలో మనస్పర్ధలు ఉంటే మనం కుటుంబ సభ్యులులాగా కలిసి మనమందరం మాట్లాడుకుని ఐక్యత ఉండి దుబ్బాకలో గులాబీ జెండా ఎగిరే వరకు ప్రతి ఒక్క కార్యకర్త ఈ 50 రోజులు బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తే ఐదు సంవత్సరాలు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి  అందరి కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. గ్రామంలో ముఖ్యంగా యువకులు అందరు కూడా చైతన్యవంతులై మాయమాటలు నమ్మకుండా మోసపోకుండా బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు మున్న, సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ ప్రభాకర్, ఏఎంసి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు ఇప్ప దయాకర్, రాజేశ్వర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు పెయింటర్ రవి, నాయకులు దయాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, మాజీ సర్పంచ్ చిరంజీవి, ఏఏంసి డైరెక్టర్ లింగం, రైతుబంధు గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love